అంతర పంటలతో అధిక ఆదాయం

ABN , First Publish Date - 2021-12-28T06:32:27+05:30 IST

అంతర పంటలతో అధిక ఆదాయం

అంతర పంటలతో అధిక ఆదాయం
క్యాబేజీ సాగులో అంతర పంటపై అవగాహన కల్పిస్తున్న ఏవో శివప్రసాద్‌

పెద ఓగిరాల(ఉయ్యూరు), డిసెంబరు 27 : వాణిజ్య పంటల్లో అంతర పంటల సాగుచేయడం ద్వారా అధిక ఆదాయం గడించవచ్చని ఉయ్యూరు ఏవో శివప్రసాద్‌ అన్నారు. పెదఓగిరాలలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించి,  అంతర పంటల సాగుపై అవగాహన కల్పించారు.  అరటి క్యాబేజి, కంద క్యాబేజి, పసుపు అరటి, మిరప కాకర, పసుపు బొప్పాయి అంతర పంటలుగా సాగుచేయవచ్చని, మొదటి పంటగా అరటిలో వేసిన  ఎరువులు రెండో పంటకు పూర్తిగా ఉపయోగపడతాయన్నారు. రెండో పంటగా వేసిన  కూరగాయల కాలం 80 రోజులుకాగా  మొదటి పంట అందేలోపు రెండో పంట చేతికి వస్తుందన్నారు. రెండో పంటకు ప్రత్యేకంగా ఎటువంటి ఎరువుల ఖర్చు లేకుండా పంటను పొందవచ్చని, కౌలు రైతులకు ఖర్చులు పోను 60 నుంచి 70 వేలు ఆదాయం  వస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యం సంభవించినా ఎదో ఒక పంట నుంచి ఆదాయం పొందవచ్చని సూచించారు. 

Updated Date - 2021-12-28T06:32:27+05:30 IST