అధిక ధరల వసూళ్లు సహించం

ABN , First Publish Date - 2021-05-13T06:25:16+05:30 IST

అధిక ధరల వసూళ్లు సహించం

అధిక ధరల వసూళ్లు సహించం
అంబులెన్స్‌ యజమానులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

 ఫఅంబులెన్స్‌ యజమానులకు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీల హెచ్చరిక

 గుణదల, మే 12 : అనారోగ్యంతో బాధపడే వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో నిబంధనలు అతిక్రమించి అధిక ధరలు వసూలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీలు జి.వి.రమణమూర్తి, వి.ఎస్‌. ఎన్‌.శర్మ అంబులెన్స్‌ యజమానులను హెచ్చరించారు. కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ ప్రభావం నగరంలో ఎక్కువగా ఉండటంతో కొవిడ్‌ పేషెంట్లను ఆసుపత్రికి తరలించే సందర్భంలో పేషెంట్ల వద్దనుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో సీపీ ఆదేశాల మేరకు అంబులెన్స్‌ యజ మానులకు బుధవారం కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు  ఏసీపీ జి.వి.రమణమూర్తి తెలిపారు.  అధికధరలు వసూలు చేస్తున్నట్లుగా తమకు ఎవరైనా సమాచారం ఇస్తే మొదట గా యజమానులు ఆ తర్వాత అంబులెన్స్‌ డ్రైవర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని  తెలిపారు. సమాచారం అందజేయాల్సిన టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయం ఫోన్‌ నెంబరు 0866-2575235 : ఏసీపీ -1 9440627089, ఏసీపీ -2 8333 99103 నెంబర్లకు ఫోన్‌చేసి సమాచారం అందించాలని కోరారు. 

Updated Date - 2021-05-13T06:25:16+05:30 IST