సీజేఐ ఎన్వీ రమణకు అమరావతి రైతుల స్వాగత ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-12-26T18:31:19+05:30 IST
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో సన్మాన కార్యక్రమం జరగనుంది.

విజయవాడ: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో సన్మాన కార్యక్రమం జరగనుంది. మార్గమధ్యంలో అమరావతి రైతులు సీజేఐకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. భారీగా రైతులు తరలి రావడంతో అక్కడ సందడి నెలకొంది. న్యాయస్థానాలే తమకు న్యాయం చేస్తాయనే నమ్మకంతో రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. తమ బాధను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియజేసేందుకు ఇదొక వేధికగా భావించామని రైతులు ఏబీఎన్‌తో అన్నారు. న్యాయం ఎటువైపు ఉంటే అలాగే తీర్పు ఇవ్వాలని ఎన్వీ రమణను వేడుకుంటున్నామన్నారు. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చాలని కోరుతున్నామన్నారు.