ఆయుర్వేదం కొవిడ్ మందుపై కొనసాగుతున్న సందిగ్ధత

ABN , First Publish Date - 2021-05-21T19:11:45+05:30 IST

నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయుర్వేదం కోవిడ్ మందుపై సందిగ్ధత కొనసాగుతోంది.

ఆయుర్వేదం కొవిడ్ మందుపై కొనసాగుతున్న సందిగ్ధత

అమరావతి: నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయుర్వేదం  కోవిడ్ మందుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆయుర్వేదం మందు కోసం పలు ప్రాంతాల నుంచి వేలాది మంది జనం తరలివస్తున్నారు. పలు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ చేసి ఆక్సిజన్ పెట్టుకుని మరీ కోవిడ్ రోగులు ముత్తుకూరుకు వస్తున్నారు. ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఆయుర్వేదం మందు పంపిణీ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కాసేపట్లో సీఎం సమీక్ష చేయనున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఆయుర్వేదం మందు శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని తెలుసుకోనున్నారు. ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై సీఎం చర్చించనున్నారు.  ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి  ఇవ్వాలా వద్దా అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పంపిణీకి అనుమతిస్తే ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై సీఎం జగన్ చర్చించి ఆదేశాలివ్వనున్నారు. 

Updated Date - 2021-05-21T19:11:45+05:30 IST