ఈ కపట ప్రేమ ఎందుకు! జగన్ గారు...:రమేష్ నాయుడు

ABN , First Publish Date - 2021-05-18T18:15:00+05:30 IST

కొవిడ్ కేర్ సెంటర్‌లు‌గా హిందూ ఆలయాలుతో పాటు ? ఇతరులవి ఎందుకు వాడుకోరు అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ప్రశ్నించారు.

ఈ కపట ప్రేమ ఎందుకు! జగన్ గారు...:రమేష్ నాయుడు

అమరావతి: కొవిడ్ కేర్ సెంటర్‌లు‌గా హిందూ ఆలయాలుతో పాటు ? ఇతరులవి ఎందుకు వాడుకోరు అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ప్రశ్నించారు. ఆలయాలలో సరే, మరి చర్చిలు , మసీదులు ఎందుకు అత్యవసర సేవలకు నోచుకోలేదని నిలదీశారు. ‘‘ఈ కపట ప్రేమ ఎందుకు! దీనినే చౌకబారు రాజకీయం అంటారు! సీఎం జగన్‌ గారు, అన్ని మతాలలో కరోనా బాధితులు వున్నారు! వారి ప్రధానాలయాలను తీసుకోండి! కేవలం హిందూ ఆలయాలు మాత్రమే అంటే నిర్ద్వందంగా ఎండగట్టుతాము!’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే హిందూ ఆలయాల వసతి గృహాలు కోవిడ్ కేర్‌ సెంటర్లుగా అద్భుతమైన సేవాలు అందిస్తున్నాయని...మరి ఒక్కటంటే ఒకటి ఇతరులవి ఏర్పాటు చెయ్యలేక పోతున్నారని మండిపడ్డారు. కారణం ప్రశ్నించేవారు లేరనా? లేక అన్నింటికి తలూపే దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారనా అంటూ రమేష్ నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-18T18:15:00+05:30 IST