తెలంగాణ, ఏపీ సరిహద్దులో నిర్మానుష్య వాతావరణం
ABN , First Publish Date - 2021-05-05T19:31:54+05:30 IST
కరోనా తీవ్రత దృష్ట్యా ఏపీలో కర్ఫ్యూ అమలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సరిహద్దులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

అమరావతి: కరోనా తీవ్రత దృష్ట్యా ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సరిహద్దులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై మందకొడిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సరిహద్దులు, జాతీయ రహదారిపై తిరుగుతున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. సరైన కారణం లేకపోతే వాహలను వెనక్కి పంపించి వేస్తున్నారు. జాతీయ రహదారి వెంట ఉన్న హోటల్స్‌లో టేక్ ఎవే సేల్స్ వరకే అనుమతి ఇచ్చారు.