గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్
ABN , First Publish Date - 2021-01-20T15:17:56+05:30 IST
గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

అమరావతి: గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి ఉద్యమం 400 రోజుల పూర్తి అయిన నేపథ్యంలో టీడీపీ దీక్షకు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో గొల్లపూడి వన్ సెంటర్ పోలీసుల వలయంలో ఉంది. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నివాసం సమీపంలోని నివాసాలు ఉండే వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గొల్లపూడి ప్రాంతం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. పోలీస్ ఆంక్షలతో దేవినేని ఉమ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు టీడీపీ నాయకులు దులిపాళ్ల నరేంద్ర మద్దతు తెలిపారు.