ఆలిండియా ఉమెన్‌ వాలీబాల్‌ టోర్నీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-22T05:21:27+05:30 IST

ఆలిండియా ఉమెన్‌ వాలీబాల్‌ టోర్నీ ప్రారంభం

ఆలిండియా ఉమెన్‌ వాలీబాల్‌ టోర్నీ ప్రారంభం

భవానీపురం, నవంబరు 21 : ఎంసీఎఫ్‌ వాలీబాల్‌ ప్లేయర్స్‌ వీఏకేడీ-ఎన్‌బీపీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా ఇన్విటేషన్‌ వాలీబాల్‌ ఉమెన్‌ టోర్నమెంట్‌ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌ తొలి సర్వీస్‌ చేసి ప్రారంభించారు. వాలీబాల్‌ క్రీడాకారులు ఎ.జగన్‌మోహన్‌ (బాబా), అన్వర్‌ షరీఫ్‌, వి.రాంబాబు స్మారకార్థం ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వాలీబాల్‌ అభ్యసనతోనే తాను రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ టోర్నీలో ఐదు జట్లు లీగ్‌ పద్ధతిలో తలపడతాయి. అంతర్జాతీయ క్రీడాకారులుగా ఏపీ నుంచి ఎదిగిన జాగర్లమూడి, సింగారావు, జి.విజయ్‌చంద్‌, అర్జున అవార్డీ ఎం.శ్యామ్‌ సుందర్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణారావును నిర్వాహకులు ఎన్‌.బ్రహ్మాజీరావు, డి.దయాకరరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు జి.నరసింహారావు (కుమార్‌), కె.వెంకటేశ్వరరావు, అంబేడ్కర్‌ యూనివర్సిటీ స్పెషల్‌ ఆఫీసర్‌ వెలగాజోషి, బంగార్రాజు, ఖాసింఖాన్‌ పాల్గొన్నారు. తొలిమ్యాచ్‌ ఎన్‌బీపీ ట్రస్ట్‌ (ఏపీ) సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (సికింద్రాబాద్‌) జట్ల మధ్య జరిగింది.

Updated Date - 2021-11-22T05:21:27+05:30 IST