ఆక్రమణలు తొలగించండి

ABN , First Publish Date - 2021-12-25T06:40:27+05:30 IST

ఆక్రమణలు తొలగించండి

ఆక్రమణలు తొలగించండి
పంచాయతీ కార్యదర్శి రమణకు వినతిపత్రం సమర్పిస్తున్న సుబ్రహ్మణ్యంరాజు, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌


పంచాయతీ కార్యదర్శికి టీడీపీ వినతి

విజయవాడ రూరల్‌, డిసెంబరు 24 : నున్నలో విజయవాడ - నూజివీడు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు వెంబడి పవర్‌గ్రిడ్‌ గోడను ఆనుకుని వెలుస్తున్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు పార్టీ మచిలీపట్నం పార్లమెంటు ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యంరాజు, నున్న గ్రామ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు యువత విజయవాడ రూరల్‌ మండల అధ్యక్షుడు గంపా శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పంచాయతీ కార్యదర్శి జీటీవీ రమణకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. మాంసం దుకాణాలను తొలగించిన తర్వాత ఏడెనిమిదికే పంచాయతీ అనుమతి ఉందని, కానీ, పదుల సంఖ్యలో ఆక్రమణలు వెలిశాయని, చివరకు హెచ్చరిక బోర్డును కూడా పక్కకు తోసి ఆక్రమిస్తున్నారని వారు కార్యదర్శికి వివరించారు. తక్షణమే ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బొకినాల తిరుపతిరావు, అంగజాల శివయ్య, మాదు శ్రీనివాసరావు, వల్లూరు శివ, బేతపూడి శ్రీనివాసరావు, తగరం దావీదు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-25T06:40:27+05:30 IST