అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2021-10-21T06:26:08+05:30 IST

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
ఉంగుటూరు స్టేషన్లో నిరసన తెలుపుతున్న బచ్చుల, బోడె

  టీడీపీ బంద్‌కు అడుగడుగునా ఆటంకాలు..   ముందస్తు అరెస్టులు..  నేతల గృహ నిర్బంధాలు..

    విజయవాడ రూరల్‌, అక్టోబరు 20 : టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడికి నిరసనగా పార్టీ చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవాడ రూరల్‌ మండలంలో బుధవారం ప్రశాంతంగా జరిగింది. బంద్‌ను పురస్కరించుకుని పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు తదితర గ్రామాలలో బంద్‌ జరిగింది. ఎనికేపాడులో టీడీపీ విజయవాడ రూరల్‌ మండల అధ్యక్షుడు గొడ్డళ్ల చిన రామారావు, ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్‌, సీనియర్‌ నాయకుడు కోనేరు శివరామకృష్ణ (పెదబాబు) ఆధ్వర్యంలో బంద్‌ పాటించారు. ఎనికేపాడు, రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానూరు తదితర గ్రామాలలో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి బాబూరావు, మాజీ సర్పంచ్‌ బొప్పన హరికృష్ణ తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. స్థానిక నాయకులను ఇళ్ల నుంచి బయటకు రానీయలేదు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. బంద్‌లో పార్టీ శ్రేణులు టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నేతలు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యం అపహాస్యం : జాస్తి

గన్నవరం : అక్రమ అరెస్టులు, నిర్బంధాలు అప్రజస్వామికమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అన్నారు. బంద్‌లో భాగంగా బుధవారం టీడీపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి గన్నవరం పోలీ్‌సస్టేషన్‌లో ఉంచారు. తెలుగు యువత మండల అధ్యక్షుడు చీమలదండు రామకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌లో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచలేరన్నారు. దాడులకు భయపడేది లేదని పేర్కొన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం పార్లమెంట్‌ కార్యదర్శి జూపల్లి సురేష్‌, తెలుగు యువత ఉపాధ్యక్షుడు మండవ అన్వేష్‌, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు బడుగు కార్తీక్‌, తెలుగు యువత మండల అధ్యక్షుడు చీమలదండు రామకృష్ణ, మండల తెలుగు రైతు అధ్యక్షుడు ఆరుమళ్ల కృష్ణారెడ్డి, సూరంపల్లి మాజీసర్పంచ్‌ దేవరపల్లి కోటేశ్వరరావు, గ్రామ అఽధ్యక్షుడు బెజవాడ శ్రీను, తెలుగు యువత నేత బడుగు దుర్గాప్రసాద్‌, బీసీ సెల్‌ నాయకులు జొన్నలగడ్డ సుధాకర్‌, నక్కా సుబ్బారావులను ఉదయం నుంచి గన్నవరం స్టేషన్‌లో నిర్భంధించారు. ముస్తాబాదలో పాఠశాలలు, షాపులను టీడీపీ నాయకులు మూసివేయించారు. నాయకులు మేడేపల్లి కాంతారావు, బోడపాటి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

పోలీ్‌సస్టేషన్‌ వద్ద బచ్చుల, బోడె నిరసన

ఉంగుటూరు : చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ శ్రేణులు తలపెట్టిన బంద్‌, నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను పోలీసులు వారి ఇంటివద్ద అరె్‌స్టచేసి ఉంగుటూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌ వద్ద ఎమ్మెల్సీ బచ్చుల, బోడె తమ నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవ మర్యాదలు లేని వ్యక్తి జగన్‌ అని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే దురుద్దేశంతో దాడులు చేయించి, వారిపై కేసులు పెట్టడం ఒక దుర్మార్గమైన ఆలోచన అని దుయ్యబట్టారు. ఎవరూలేని సమయంలో ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపై దాడిచేయడం వైసీపీ నాయకుల చేతగానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. 

ఉంగుటూరులో.. 

ఉంగుటూరు: మండలంలో బంద్‌ విజయవంతమైంది. మండలంలోని తేలప్రోలు, ఉంగుటూరు, పెదఅవుటపల్లి, మానికొండ, ఆత్కూరు, పొట్టిపాడు, తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీజెండాలు చేతబూని నినాదాలతో హోరెత్తిస్తూ ప్రధాన రహదారుల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ గూండాలను తక్షణమే అరెస్ట్‌ చేయాలంటూ నిరసన గళం వినిపించారు. గ్రామాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, పాఠశాలలు మూసివేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆళ్ళ హనోక్‌, తెలుగు యువత మండల అధ్యక్షుడు వంగ అయ్యప్పరెడ్డి, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ మండల అధ్యక్షుడు కోనేరు రాము, తాటిపాముల నాగయ్య, ద్రోణవల్లి శివరామకృష్ణ, షబ్బీర్‌, సందీప్‌, ప్రసన్న వెంకట్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నాగబాబు, రాము, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:26:08+05:30 IST