హక్కులపై అవగాహన అవసరం
ABN , First Publish Date - 2021-10-21T06:32:52+05:30 IST
హక్కులపై అవగాహన అవసరం

హనుమాన్‌జంక్షన్ రూరల్, అక్టోబరు 20 : చట్టాల గురించి, న్యాయ పరంగా ప్రజల హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్ తంగమణి సూచించారు. పెరికీడు గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు చట్టాల్లో గల పరిష్కారాల గురించి తంగమణి వివరించారు.పోలీసు చట్టాల గురించి ఎస్సై గౌతమ్‌కుమార్, దిశ యాప్ గురించి ఎస్సై ఉషారాణి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాన్‌ప్రకాష్, అడ్వకేట్ లింగంనేని రాజారావు, మాజీ సర్పంచ్ తవ్యామూర్తి, తదితరులు పాల్గొన్నారు.