ఘనంగా అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-08-30T05:38:34+05:30 IST

నగరంలో పలు చోట్ల సినీ నటుడు అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

ఘనంగా అక్కినేని నాగార్జున   జన్మదిన వేడుకలు
అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేస్తున్న సర్వేశ్వరరావు, ఇతర అభిమానులు

 ఘనంగా అక్కినేని నాగార్జున 

జన్మదిన వేడుకలు

విజయవాడ కల్చరల్‌, ఆగస్టు 29 : నగరంలో పలు చోట్ల సినీ నటుడు అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కామాక్షి ఫిలిమ్స్‌, ఆలిండియా అక్కినేని యువసేన ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్‌ అలంకార్‌ సెంటర్‌లో నిర్వహించారు. సింగ్‌నగర్‌, కృష్ణలంక, సత్యనారాయణపురం, వన్‌టౌన్‌, భవానీపురం ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కామాక్షి ఫిలిమ్స్‌ అధినేత ఎన్‌.సర్వేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు చిత్ర సీమలో అరుదైన నటనతో నాగార్జున సందేశాత్మకమైన సాంఘిక చిత్రాలతో పాటు అన్నమయ్య, రామదాసులాంటి భక్తి చిత్రాలలో నటించి మెప్పిస్తున్నారని అన్నారు. బర్త్‌డే కేక్‌లు కట్‌ చేసి కృష్ణలంకలోని అనాథ ఆశ్రమంలో, బందరు రోడ్డులోని నిర్మల హృదయ్‌ భవన్‌లో స్వీట్స్‌, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. శేఖర్‌, బి.కృష్ణ, కె.ప్రభాకర్‌, ఎస్‌.సత్యం, ఎస్‌కె. బాషా, జి.గణేష్‌, సుభాష్‌రెడ్డి, అమర్‌, రమ్మీరెడ్డి, ముత్యాలు, శ్యామ్‌, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-30T05:38:34+05:30 IST