ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్
ABN , First Publish Date - 2021-12-30T06:26:42+05:30 IST
ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్

గన్నవరం, డిసెంబరు 29 : ఎయిర్ పోర్టులో భద్రతా చర్యల్లో భాగంగా బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించినట్టు ఎయిర్‌పోర్టు ఇన్‌చార్జి డైరెక్టర్ పీవీ రామారావు తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న వివరాలను ఆయన తెలియజేశారు. సిబ్బంది అప్రమత్తతపై మాక్‌డ్రిల్ సారంశాన్ని వివరించారు. ‘‘ బాం బు కలకలం రేగింది. ఉగ్రవాదులు ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామని తమ డిమాం డ్లు తీర్చాలని అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఎయిర్‌పోర్టు ఇన్‌చార్జి డైరెక్టర్ పీవీ రామారావు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్లు సమాచారం అందిందని ప్రయాణికులకు తెలియకుండా చాకచక్యంగా బాంబును నిర్వీర్యం చేయాలని ఏసీపీ వెంకటరత్నం, ఇతర అధికారుల తో చర్చించారు. బాంబ్ స్క్వాడ్ బృందం రంగంలోకి దిగింది. ఉగ్రవాదులతో మాట్లాడుతూనే ఎయిర్‌పోర్టులో వారు పెట్టిన రెండు బాంబులను బాంబ్ స్క్వాడ్ బృందం గుర్తించింది. వాటిని నిర్వీర్యం చేశారు.
కొంత సేపటికి బాంబ్ స్క్వాడ్ హడావిడితో ప్రయాణికులకు ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టారని తెలిసి భయాందోళన చెందారు. రెండు బాంబులు నిర్వీర్యం చేశారని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.’’ సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు మాక్‌డ్రిల్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.