ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యథావిధిగా కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-11-02T06:17:13+05:30 IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యథావిధిగా కొనసాగించాలి

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యథావిధిగా కొనసాగించాలి
నిరసనలో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు

వివేకానంద స్కూల్‌ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

పాయకాపురం, నవంబరు 1 : ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ సోమవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమేశ్వరరావు మాట్లాడుతూ జీవో నెంబరు 42, 50ను రద్దు చేసి, ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ప్రభుత్వ మొండి వైఖరిని అణచివేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఓ.యేసుబాబు, డీవైఎఫ్‌ఐ నగర ఉపాధ్యక్షుడు ఎస్‌కే నిజాం, ఎస్‌కే పీరు, మహేశ్‌, కె.స్వామి, ఐద్వా నగర కార్యదర్శి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-02T06:17:13+05:30 IST