అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-03-21T05:50:12+05:30 IST

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి
అధికారులతో సమీక్షిస్తున్న ప్రత్యేక అధికారి ప్రసాద్‌

ఉంగుటూరు, మార్చి 20 :  మండలంలోని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని  ఉంగుటూరు మండల పరిషత్‌ ప్రత్యేకాధికారి డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ప్రాజెక్ట్‌ డివిజన్‌ విజయవాడ) పీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అన్నారు. శనివారం ప్రత్యేక అధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మండల పరిషత్‌ అభివృద్ధి ప్రణాళికపై అన్నిశాఖల అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామా ల్లో సమస్యలను గుర్తించి వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సూపరింటెండెంట్‌ కె.రమణబాబు, ఈఓపీఆర్డీ వి.ఏ.విజయకుమార్‌, హౌసింగ్‌ ఏఈ ఎం.సురేష్‌, పీఆర్‌ ఏఈ బాబూరావు, ఇరిగేషన్‌ ఏఈఈ తనూజ, వైఎస్సార్‌ క్రాంతిపథం ఏపీఎం, ఎం.సాంబశివరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీఓ  అశోక్‌కుమార్‌, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-21T05:50:12+05:30 IST