అకౌంటెంట్ దుర్మరణం
ABN , First Publish Date - 2021-12-31T06:04:59+05:30 IST
అకౌంటెంట్ దుర్మరణం

హనుమాన్‌జంక్షన్ రూరల్: జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో బైక్ నడుపుతున్న ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల అకౌంటెంట్ దుర్మరణం చెందిన ఘటన గురువారం జరిగింది. ఏలూరుకు చెందిన మానేపల్లి వినయ్(27) హనుమాన్‌జంక్షన్ వైపు వస్తూ బొమ్ములూరు వంతెన వద్ద ముందు వెళుతున్న లారీ ఆకస్మాత్తుగా ఆగడంతో వెనుకవైపు నుంచి ఢీ కొట్టాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ లారీ ఆపకుండా పరార్ అవడానికి ప్రయత్నించగా హైవే మొబైల్ సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గౌతమ్‌కుమార్ తెలిపారు.