ప్రొక్లెయిన్‌ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-12-25T06:36:36+05:30 IST

ప్రొక్లెయిన్‌ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రొక్లెయిన్‌ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

పాయకాపురం, డిసెంబరు 24: ప్రొక్లెయిన్‌ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై శుక్రవారం నున్న రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మిడివరం గ్రామానికి చెందిన సాఽధనాల వెంకరమణ(50) నున్నలోని కోళ్ల ఫాంలో పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం కోళ్ల ఫాం నుంచి టిఫిన్‌ చేయడానికి బయటకు వెళ్తుండగా, రామచంద్రపాలెం అడ్డరోడ్డు వద్ద ప్రొక్లెయిన్‌ డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వెంకటరమణ పైకి ఎక్కించాడు. కాలుపై నుంచి ప్రొక్లెయిన్‌ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-25T06:36:36+05:30 IST