రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-07T06:38:17+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జగ్గయ్యపేట రూరల్‌, డిసెంబరు 6: బైకు అదుపు తప్పి.. స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన సోమవారం జరిగింది. జాతీయ రహదారి నుంచి బలుసుపాడు వెళ్లే రోడ్డులో బైక్‌ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న స్కూల్‌ బస్సును ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న జగ్గయ్యపేటకు చెందిన పులిమంతల శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. చిల్లకల్లు ఎస్సై రమేష్‌ అతడిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయవాడకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Updated Date - 2021-12-07T06:38:17+05:30 IST