వ్యవసాయ బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2021-05-13T06:01:05+05:30 IST
వ్యవసాయ బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

వత్సవాయి, మే 12: మండలంలోని పెదమోదుగపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బూచవరంలోని వ్యవసాయబావిలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కంచర్ల నవీన్ (20) తల్లిదండ్రులు సమీపంలోని బుధవారం జగ్గయ్యపేట మండలం బూచవరంలో కూలీ పనులకు వెళ్లారు. వారికి భోజనం ఇచ్చి మంచినీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు వెతికారు. బావిలో శవమై కనిపించాడు. చిల్లకల్లు పోలీసులు విచారణ జరుపుతున్నారు.