ఆర్‌డబ్ల్యూఎస్‌లో నిబంధనలకు నీళ్లు

ABN , First Publish Date - 2021-01-12T06:50:07+05:30 IST

గ్రామీణ నీటిపారుదల శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్‌)లో నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌లో నిబంధనలకు నీళ్లు
ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ సిబ్బంది

వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏసీబీ

కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు


విజయవాడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ నీటిపారుదల శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్‌)లో నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. ఈ శాఖలో అధికారుల సొంత ఎజెండా అమలవుతోంది. దీనిపై వరుస ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక శాఖ రంగంలో దిగింది. ఏసీబీ అదనపు ఎస్పీ మహేశ్వరరావు, జిల్లా డీఎస్పీ శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం ఎంజీ రోడ్డులో ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్‌ విజయవాడ డివిజన్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ‘ఈ’ ఫైళ్లన్నంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. తొలిరోజు తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు బయటపడలేదు. ఈ తనిఖీలు మరో రెండు మూడు రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏసీబీ తనిఖీలతో ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉన్న అక్రమార్కులు వణుకుతున్నారు.

Updated Date - 2021-01-12T06:50:07+05:30 IST