అర్జీలు 81... పరిష్కారం 59

ABN , First Publish Date - 2021-08-27T06:00:32+05:30 IST

నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అర్జీలు 81... పరిష్కారం 59

అర్జీలు 81... పరిష్కారం 59 

ఐదువారాల స్పందన 

మేయర్‌ భాగ్యలక్ష్మి 

చిట్టినగర్‌, ఆగస్టు 26: నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 26న స్పందన ప్రారంభించామని, అప్పటి నుంచి 5వారాల స్పందనలో 81 మంది వివిధ సమస్యలకు సంబంధించి అర్జీ పెట్టుకున్నారని తెలిపారు. వాటిలో 59 అర్టీలకు సంబంధించిన సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఆర్థికపరమైన 22 అర్టీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. స్పందనలో ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత వెబ్‌ సైట్‌లో నమోదు చేసి ఆయా శాఖల అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం అనంతరం అర్జీదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేస్తున్నామని మేయర్‌ తెలిపారు.  

Updated Date - 2021-08-27T06:00:32+05:30 IST