450 మద్యం సీసాలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-08T06:22:11+05:30 IST

తెలంగాణ నుంచి అక్రమ మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

450 మద్యం సీసాలు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో పాటు నిందితులు

మైలవరం, డిసెంబరు 7: తెలంగాణ నుంచి అక్రమ మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ సీఐ గిరిజ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఎస్‌ఈబీ సిబ్బందితో కలసి సీఐ ప్రత్యేక నిఘా పెట్టారు. విజయవాడ రూరల్‌ కొత్తూరు తాడేపల్లికి చెందిన ఇద్దరు  రెండు ఆటోల్లో 450 మద్యం సీసాలు తరలిస్తుండగా జి.కొండూరు మండలం కందులపాడు అడ్డరోడ్డు వద్ద వారిని అదుపులోకి తీసుకొని మైలవరం డివిజనల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయానికి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి ఆటోలను సీజ్‌ చేసినట్లు గిరిజ తెలిపారు. 


Updated Date - 2021-12-08T06:22:11+05:30 IST