మెగా జాబ్‌మేళాలో 404 మందికి ఉద్యోగాలు
ABN , First Publish Date - 2021-12-31T05:44:49+05:30 IST
ఆంధ్రా లయోలా కళాశాల, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లయోలా కళాశాలలో గురువారం మెగా జాబ్‌మేళా జరిగింది.

మెగా జాబ్‌మేళాలో
404 మందికి ఉద్యోగాలు
భారతీనగర్, డిసెంబరు 30: ఆంధ్రా లయోలా కళాశాల, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లయోలా కళాశాలలో గురువారం మెగా జాబ్‌మేళా జరిగింది. ఈ మేళాలో ప్రముఖ మహీంద్ర, విప్రో, స్టార్‌టెక్, టాటాస్కై, డి-మార్ట్, మెడ్‌ప్లస్ తదితర 33 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళాలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బబీటెక్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ , ఫార్మసీ అర్హత కలిగిన విద్యార్థులు పాల్గొనగా వారిలో 404 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆఫర్ లెటర్‌లు అందజేశారు. ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిశోర్, కో-ఆర్డినేటర్ ఎంప్లాయబిలిటీ స్కిల్ అఽఽధికారి. డాక్టర్ జి.సహాయభాస్కరన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆధికారి పి.ప్రణయ్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మోహన్, ఏపీఎస్‌ఎస్‌డీసీ సంస్థ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.