నాలుగున్నర కిలోల కణితి తొలగింపు
ABN , First Publish Date - 2021-12-30T06:40:26+05:30 IST
నాలుగున్నర కిలోల కణితి తొలగింపు

వన్‌టౌన్, డిసెంబరు 29 : పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగికి ఆపరేషన్ చేసి నాలుగున్నర కిలోల కణితిని తొలగించారు. సీహెచ్ ఆదిలక్ష్మి అనే రోగికి లేపరోటమి విధానం ద్వారా ఆసుపత్రి సూపరింటెండెంట్, సర్జన్ వై.కిరణ్‌కుమార్ గైనిక్ ఆపరేషన్ థియేటర్‌లో బుధవారం ఈ శస్త్రచికిత్స చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యూజ్ మల్టీపుల్ ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యుటెరస్‌గా కణితిని పరిగణిస్తారన్నారు. పేషెంట్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇటువంటి కీలకమైన ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా రోగుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పీఎన్ రావు, డాక్టర్ రాంబాబు, గైనిక్ డాక్టర్లు కరుణ, శాంత తదితరులు పాల్గొన్నారు.