21 కేసులు.. ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-12-09T06:03:14+05:30 IST
21 కేసులు.. ఒకరు మృతి

విజయవాడ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బుధవారం మరో కరోనా బాధితుడు మరణించాడు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21 మంది వైరస్ బారినపడ్డారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,20,443కు చేరగా, మరణాలు 1,465కు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1,18,682 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 296 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.