బ్రేకింగ్ : Badvel ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

ABN , First Publish Date - 2021-11-02T17:44:13+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు...

బ్రేకింగ్ : Badvel ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

కడప : బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది. మొత్తమ్మీద నోటా, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ మెజార్టీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,550 ఓట్ల భారీ మెజార్టీతో సుధా గెలుపొందారు.


కాగా.. చివరి రౌండ్ వరకూ బీజేపీ అభ్యర్థికి దక్కిన ఓట్లు 20 వేల ఓట్ల పైచిలుకు మాత్రమే. ఈ ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీ చేయలేదు. దీంతో బీజేపీకి కూడా ఊహించిన దానికంటే ఎక్కువే ఓట్లు వచ్చాయని, గతంతో పోలిస్తే ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. నియోజకవర్గంలో పార్టీ బలపడిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Updated Date - 2021-11-02T17:44:13+05:30 IST