నేటి నుంచి వైఎ్‌సఆర్‌ ఆసరా వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-11-06T05:08:57+05:30 IST

వైఎ్‌సఆర్‌ ఆసరా పథకం వారోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి వైఎ్‌సఆర్‌ ఆసరా వారోత్సవాలు

 మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు

రాయచోటిటౌన్‌, నవంబరు5: వైఎ్‌సఆర్‌ ఆసరా పథకం వారోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6న ఉదయం మాసాపేట మార్కెట్‌ యార్డులో 1, 2, 3, 33, 34 వార్డులకు సంబంధించి సమావేశం ఉంటుందన్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని సాహీషాదీఖానాలో 4, 5, 6, 7, 8 వార్డులకు సమావేశం ఉంటుందన్నారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో 9, 10, 11, 12, 13 వార్డులకు, ఉదయం 11.30 గంటలకు పట్టణంలోని బోస్‌నగర్‌లో 23, 24, 25 వార్డులకు, మధ్యాహ్నం 3 గంటలకు పట్టణ పరిధిలోని చిత్తూరు రోడ్డులో గల శ్రీశక్తి భవనంలో 14, 15, 16, 22 వార్డులకు సంబంధించి సమావేశాలు ఉంటాయన్నారు. అలాగే 8వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో 17, 18, 19, 20, 21, 26, 27, 32 వార్డులకు, మధ్యాహ్నం 3 గంటలకు మార్కెట్‌ ఉర్దూ స్కూల్‌లో 28, 29, 30, 31 వార్డులకు సమావేశాలు ఉంటాయని ఆయన తెలియజేశారు.  మున్సిపాలిటీ పరిధిలో జరిగే సమావేశాలకు ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు, లబ్ధిదారులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-11-06T05:08:57+05:30 IST