మీ సేవలు మానవత్వానికి ప్రతీక : ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-19T04:42:13+05:30 IST

‘మీ సేవలు మానవత్వానికి ప్రతీక’ అని ఎస్పీ అన్బురాజన్‌ అన్నారు.

మీ సేవలు మానవత్వానికి ప్రతీక : ఎస్పీ
బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ బాబా ఫకృద్దీన్‌, హోంగార్డు సుబ్బారావుకు నగదు రివార్డు అందిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

కడప(క్రైం), మే 18: ‘మీ సేవలు మానవత్వానికి ప్రతీక’ అని ఎస్పీ అన్బురాజన్‌ అన్నారు. ప్రొద్దుటూరులో గుర్తు తెలియని మృతదేహాన్ని కాల్వ నుంచి వెలికితీసి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్‌, హోం గార్డు అభినందనీ యులన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ బాబా ఫకృద్దీన్‌ (పీసీ 2146), హోంగార్డు సుబ్బారావు (హెచ్‌జి 43)కు నగదు రివార్డులు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.. అసలే కరోనా కాలం. సాటి మనుషులు కనిపించినా దూరంగా వెళ్లే పరిస్థితులు. సొంత బంధువులు చనిపోయినా సరే ఆ ఇంటి పరిసరాల వైపు కూడా కన్నెత్తి కూడా చూడని ప్రస్తుత తరుణంలో మురికి కాల్వలో కూరుకుపోయిన మృతదేహాన్ని బయటికి తీసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని మడూరు మురికి కాల్వలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయం విధుల్లో ఉన్న బాబా ఫకృద్దీన్‌, సుబ్బారావుకు తెలియడంతో సంఘటనాస్థలానికి వెళ్లారు. అయితే స్థానికులు ఆ మృతదేహాన్ని బయటకు తీయడానికి సాహసించలేదు. మనకెందుకులే.. మున్సిపాలిటీ వాళ్లు వచ్చి తీస్తారులే.. అని అనుకున్నారు. అయితే కానిస్టేబుల్‌ బాబా ఫకృద్దీన్‌, హోంగార్డు సుబ్బారావు మురికి కాల్వలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీతో పాటు ట్రిబుల్‌ సి ఇన్స్‌పెక్టర్‌ యుగంధర్‌, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురే్‌ష వారిని అభినందించారు.

Updated Date - 2021-05-19T04:42:13+05:30 IST