రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
ABN , First Publish Date - 2021-05-21T04:47:30+05:30 IST
కడప నగరం వై-జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందినట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు.

కడప(క్రైం), మే 20: కడప నగరం వై-జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందినట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు... ఉక్కాయపల్లెకు చెందిన సుధారాణి (19) శ్రీకాంత్ అనే యువకుడితో గురువారం సొంత పనినిమిత్తం ద్విచక్ర వాహనంలో నగరానికి వచ్చి తిరిగి ఆర్టీసీ బస్టాండు వైపు వస్తుండగా, వై-జంక్షన్ వద్దకు రాగానే అక్కడ ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో సుధారాణి తీవ్రగాయాలై మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.