రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-08-11T05:19:58+05:30 IST

కుమ్మరకొట్టాలు సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకర్ల సుబ్బరాయుడు (30) దుర్మరణం చెందినట్లు పోలీసు లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సుబ్బరాయుడు మృతదేహం

బద్వేలు రూరల్‌, ఆగస్టు 10:  కుమ్మరకొట్టాలు సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకర్ల సుబ్బరాయుడు (30) దుర్మరణం చెందినట్లు పోలీసు లు తెలిపారు. చెముడూరు వాసి సుబ్బరాయుడు టిప్పరు డ్రైవరుగా పనిచేస్తున్నా డు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి పట్టణంలోకి వచ్చేందు కు బైకుపై వస్తుండగా కుమ్మరకొట్టాలు సమీపంలో వెనుక నుంచి ఆల్విన్‌ లారీ ఢీకొంది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఆదిలక్ష్మి, మూడు నెలల పాప ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీమాంక్‌ ఆస్పత్రికి తరలించారు. అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-11T05:19:58+05:30 IST