పురుగుల మందు తాగి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-06-10T05:17:49+05:30 IST

కల్లుట్ల వాసి తలారి ఓబు లేసు (30) పొలాలకు వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల మంచిపట్నం పోలీసులు తెలిపారు.

పురుగుల మందు తాగి యువకుడి మృతి
ఓబులేసు మృతదేహం

మైలవరం, జూన 9: కల్లుట్ల వాసి తలారి ఓబు లేసు (30) పొలాలకు వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల మంచిపట్నం పోలీసులు తెలిపారు. బుధవా రం సాయంత్రం పురుగుల మందు తాగడం తో గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్పాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికి త్స కోసం ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

తలమంచిపట్నం ఎస్‌ఐ ధనుంజయుడును వివరణ కోరగా ఓబులేసు పురుగుల మందుతాగి మృతి చెందిన విషయంపై ఎవరూ  కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.


Updated Date - 2021-06-10T05:17:49+05:30 IST