లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-23T04:45:05+05:30 IST

కడప నగరం పాతబస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

లాడ్జిలో యువకుడు ఆత్మహత్య
ప్రసాద్‌రెడ్డి మృతదేహం

కడప(క్రైం), మార్చి 22: కడప నగరం పాతబస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాడ్జి గది నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జిలో పనిచేస్తున్న సిబ్బంది అనుమానంతో అతడి రూము వద్దకు వెళ్లి తలుపులు కొట్టినా తీయకపోవడంతో గది తలుపులు పగలగొట్టి చూడడంతో లాడ్జిలోని బాత్‌రూములో చనిపోయి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకునని మృతదేహాన్ని పరిశీలించినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ-2 రామకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు వేంపల్లె మండలం వి.చర్లపల్లె గ్రామానికి చెందిన సిద్దవటం ప్రసాద్‌రెడ్డి (30) ఆరు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. ఆ యువకునికి తల్లిదండ్రులు బొలెరో వాహనాన్ని కొనివ్వడంతో బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఈనెల 6న హైదరాబాదుకు ఆమెను తీసుకుని వెళ్లాడని తరువాత మూడురోజుల తరువాత ఆ మహిళ తిరిగి వచ్చినట్లు తెలిపారు. ప్రసాద్‌రెడ్డి హైదరాబాదులోనే ఉండి ఈనెల 20వతేదీ కడపకు చేరుకుని పాత బస్టాండు సమీపంలో ఓ లాడ్జిలో రూము అద్దెకు తీసుకుని ఉన్నాడు. లాడ్జిలోని గదిలో మద్యం బాటిల్‌తో పాటు పురుగుల మందు డబ్బా కూడా ఉందని, పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తండ్రి వెంకటలక్ష్మిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-03-23T04:45:05+05:30 IST