యోగా ఆరోగ్యానికి సోపానం

ABN , First Publish Date - 2021-06-22T05:37:30+05:30 IST

యోగా మానసిక శారీరీక ఆరోగ్యానికి సోపానంలాంటిదని సంస్కృతి స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.

యోగా ఆరోగ్యానికి సోపానం
ప్రొద్దుటూరులో యోగా చేస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 21 : యోగా మానసిక శారీరీక  ఆరోగ్యానికి  సోపానంలాంటిదని సంస్కృతి స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. సోమ వారం స్థానిక వేంకటేశ్వర్ల పేటలోని సరస్వతి విద్యామందిరం లో సత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో కరోనా వైరస్‌ నివారణకు యోగాలోని ప్రాణా యామం చేయాలన్నారు. అనేక వేల ఆసనాలలో 84 ఆసనాలు ముఖ్యమైనవన్నారు.  కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మల్లికా ర్జునరావు యోగా భిక్షమయ్య నరేంద్రలకు సన్మానం చేశారు.

యోగాతో వ్యక్తిత్వ వికాసం

యోగా సాధనతోనే వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్‌ వెల్లడించారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ పట్టణ కమిటి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్సాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్నాటి ఎల్లారెడ్డి, ఉపా ధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ రెడ్డి, పట్టణ కార్యదర్శి సుబ్రమణ్యం, నరసింహులు పాల్గొన్నారు.

ఎర్రగుంట్లలో..

ఎర్రగుంట్ల జూన్‌21:స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులకు మున్సిపల్‌ చైర్మన్‌ హర్షవర్థన్‌రెడ్డి యోగా పై అవగాహన కల్పించారు. యోగా తో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. యోగాసనాలు ఒత్తిడిని నియంత్రిస్తాయని  రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. రోజూ అరగంట యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ జగన్నాథ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.Updated Date - 2021-06-22T05:37:30+05:30 IST