అసెంబ్లీలో వైసీపీ మంత్రుల తీరు భాధాకరం : టీడీపీ

ABN , First Publish Date - 2021-11-21T05:36:55+05:30 IST

శాసన సభలో టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీ పీ నేతల తీరు బాధాకరమని కడప పార్లమెంట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి, టీడీపీ నేత వెంకటరెడ్డి పేర్కొన్నారు.

అసెంబ్లీలో వైసీపీ మంత్రుల తీరు భాధాకరం : టీడీపీ
నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు

కాశినాయన నవంబరు 20: శాసన సభలో టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీ పీ నేతల తీరు బాధాకరమని కడప పార్లమెంట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి, టీడీపీ నేత వెంకటరెడ్డి పేర్కొన్నారు. నర్సాపురంలో టీడీపీ కార్యకర్తలు, నేతలతో కలిసి నల్లబ్యార్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశా రు. సర్పంచ్‌ ఖాజావలి, ఎంపీటీసీ మదార, ఉపసర్పంచ్‌ నాగేంద్రారెడ్డ్డి, మాజీ  సర్పంచ్‌ సుబ్బారెడ్డ్డి పాల్గొన్నారు.

మండిపడిన మాజీ ఎమ్మెల్యే...

బద్వేలు, నవంబరు 20: ఏపీ రాజకీయాల్లో మహిళలను కించపరచడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే కె.విజయ మ్మ, బద్వేలు నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మం త్రులు, ఎమ్మెల్యేలు మహిళను అవమానించడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు జహంగీర్‌బాష, బద్వేలు, గోపవరం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి, బసిరెడ్డి రవికుమార్‌రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, టీడీపీ రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి పాల్గొన్నారు. 

వ్యక్తిగత దూషణలు మంచిది కాదు...

పోరుమామిళ్ల, నవంబరు 20: నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మం చిది కాదని ఆర్‌ఎ్‌సఎఫ్‌ నేత బాలరంగయ్య హితవు పలి కారు. విలువలు మరిచి  మాట్లాడటం మంచిది కాదన్నారు. 

జగన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు...

అట్లూరు, నవంబరు 20: అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళను కించపరుస్తూ మాట్లాడించిన సీఎం మూల్యం చెల్లించుకో క తప్పదని టీడీపీ రాష్ట్ర పంచాయతీ సెల్‌ కమిటీ సభ్యు డు, కడప పార్లమెంట్‌ నియోజకవర్గం అధికార ప్రతినిధి కొత్తపు మునిరెడ్డి హెచ్చరించారు.

తెలుగు జాతికే అవమానం...

ఖాజీపేట, నవంబరు 20: చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపట్ల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు మహిళాలోకానికే తీరని అవమానమని తెలుగు మహిళా మాజీ ఉపాధ్యక్షురాలు రెడ్యం లక్ష్మిప్రసన్న పేర్కొన్నారు.  

మహిళలను కించపరచడం సబబుకాదు...

దువ్వూరు, నవంబరు 20: అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై పోరాడాల్సిపో వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సబబుకాదని కడపజిల్లా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల వెంకటకొండారెడ్డి పేర్కొన్నారు. 

నిరసనను అడ్డుకున్న పోలీసులు...

మైదుకూరు, నవంబరు 20: మైదుకూరులో తెలుగుయువ త పార్లమెంటరీ అధికార ప్రతినిధి నేట్లపల్లి శివరాం అం బేడ్కర్‌ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనను పోలీసులు అ డ్డుకున్నారు. దీంతో యువత పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-21T05:36:55+05:30 IST