పతనానికి పరాకాష్ట రవి అరెస్ట్‌ : టీడీపీ

ABN , First Publish Date - 2021-01-14T04:33:42+05:30 IST

ప్రభుత్వ పతనానికి పరా కాష్ట బీటెక్‌ రవి అరెస్ట్‌ అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధనరెడ్డి, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు పోతుగంటి పీరయ్య పేర్కొన్నారు

పతనానికి పరాకాష్ట రవి అరెస్ట్‌ : టీడీపీ
బీటెక్‌ రవి సతీమణి లతారెడ్డిని పరామర్శిస్తున్న గోవర్ధనరెడ్డి, పీరయ్యలు

సింహాద్రిపురం, జనవరి 13: ప్రభుత్వ పతనానికి పరా కాష్ట బీటెక్‌ రవి అరెస్ట్‌ అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధనరెడ్డి, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు పోతుగంటి పీరయ్య పేర్కొన్నారు. బుధవారం సింహాద్రిపురంలోని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి స్వగృ హంలో కుటుంబ సభ్యులు లతారెడ్డిని కలిసి పరామర్శిం చి ఆమెకు ధైర్యం చెప్పారు.

అనంతరం విలేకరులతో మా ట్లాడుతూ ప్రజాదరణ కలిగిన రవి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఉద్ధేశంతోనే భయపెట్టేందుకు అక్రమంగా అరెస్ట్‌ చేయించారన్నారు. బీటెక్‌ రవి కుటుం బాన్ని పరామర్శించిన వారిలో ప్రొద్దుటూరు నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ప్రవీనకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చల పుల్లయ్య, పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ అమీర్‌ బాషా,  10వ వార్డ్‌ ఇన్‌చార్జ్‌ నాగరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-14T04:33:42+05:30 IST