విద్యుత్తు సరఫరాకు వేగవంతంగా పనులు

ABN , First Publish Date - 2021-11-24T05:08:35+05:30 IST

అంధకారంలో ఉన్న గ్రామాలకు కరెం టు సరఫరా కోసం విద్యుత్‌ శాఖాధికారులు మంగళవారం పనులు వేగవంతం చేశారు.

విద్యుత్తు సరఫరాకు వేగవంతంగా పనులు
పనులను తనిఖీ చేస్తున్న సీఎండీ హరినాథరావు, అధికారులు

సీఎండీ హరినాథరావు

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 23: అంధకారంలో ఉన్న గ్రామాలకు కరెం టు సరఫరా కోసం విద్యుత్‌ శాఖాధికారులు మంగళవారం పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్తు శాఖ సీఎండీ హెచ్‌.హరినాథరావు, కడప ఎగ్జిక్యూటివ్‌ కన్‌స్ట్రక్షన్‌ అధికారి వెంకటసుబ్బయ్య, ప్రొద్దుటూరు ఈఈ శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు ఏడీ శేషగిరిబాబు పనులను పర్యవేక్షించారు. అంధకారంలో ఉన్న అన్ని గ్రామాలకు వెంటనే విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం పెన్నానది వంతెనను, వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కడప ఎగ్జిక్యూటివ్‌ కన్‌స్ట్రక్షన్‌ అధికారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రెండు బృందాలుగా ఏర్పడి 80 మంది సిబ్బందితో రెండు ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేసి దెబ్బతిన్న విద్యుత్తు తీగల స్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి విద్యుత్తు సరఫరా చేసేందుకు వేగవంతంగా పనులు చేపట్టామన్నారు. పెన్నానదిలో సుమారు 16 స్తంభాలు పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యుత్తు శాఖ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T05:08:35+05:30 IST