మహిళా కారాగార సూపరింటెండెంట్‌, జైలరు బదిలీ

ABN , First Publish Date - 2021-10-26T04:45:43+05:30 IST

కడప ప్రత్యేక మహిళా కారాగార సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వసంతకుమారి, జైలర్‌ భువనేశ్వరిలను బదిలీ చేస్తూ జైళ్ల శాఖ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళా కారాగార సూపరింటెండెంట్‌, జైలరు బదిలీ

కడప(క్రైం), అక్టోబరు 25 : కడప ప్రత్యేక మహిళా కారాగార సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వసంతకుమారి, జైలర్‌ భువనేశ్వరిలను బదిలీ చేస్తూ జైళ్ల శాఖ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేస్మణి అనే మహిళా జీవిత ఖైదీ కెమికల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందింది. ఈ సంఘటనపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ విచారించి నివేదిక పంపడంతో సూపరింటెండెంట్‌ వసంతకుమారిని రాజమండ్రి మహిళా జైలుకు బదిలీ చేయగా అక్కడ పనిచేస్తున్న కృష్ణవేణిని కడప ప్రత్యేక మహిళా కారాగారానికి బదిలీ చేశారు. అలాగే జైలర్‌ భువనేశ్వరిని నెల్లూరు జైలుకు బదిలీ చేశారు. 

Updated Date - 2021-10-26T04:45:43+05:30 IST