మహిళల వెలుగు రేఖ కాపు నేస్తం

ABN , First Publish Date - 2021-07-23T05:31:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం కాపు మహిళల జీవితాల్లో వెలుగురేఖలు నింపుతుందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా తెలిపారు.

మహిళల వెలుగు రేఖ కాపు నేస్తం
మెగా చెక్‌ను అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్‌ తదితరులు

జిల్లాలో 11,059 మందికి రూ.16.58 కోట్లు విడుదల

ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా

కడప (కలెక్టరేట్‌), జూలై 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం కాపు  మహిళల జీవితాల్లో వెలుగురేఖలు నింపుతుందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన మోహనరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా రెండో రెండవ విడత సాయాన్ని బటన నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చే శారు. కార్యక్రమానికి కలెక్టరేట్‌  వీసీ హాలు నుంచి ఉప ముఖ్యమంత్రితో పాటు చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంతరెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, జకియాఖానం, రమేష్‌ యాదవ్‌, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మేయర్‌ కె.సురేష్‌బాబు, అడా చైర్మన గురుమోహన, సగర కార్పొరేషన చైర్‌పర్సన రమణమ్మ, జాయింట్‌ కలెక్టర్‌ ధర్మచంద్రారెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం జిల్లా వ్యాప్తంగా 11,059 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.16.58 కోట్ల మెగాచెక్‌ను లబ్ధిదారులకు అందజేశారు. 

Updated Date - 2021-07-23T05:31:37+05:30 IST