మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-24T05:41:00+05:30 IST

మండలంలోని నారాయణనెల్లూరు గ్రామంలో ఆదివా రం తెల్లవారుజామున తోట లక్షుమ్మ అనే మహిళ మనస్థాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

మనస్థాపంతో మహిళ ఆత్మహత్య
లక్షుమ్మ మృతదేహం

పెనగలూరు, మే 23 : మండలంలోని నారాయణనెల్లూరు గ్రామంలో ఆదివా రం తెల్లవారుజామున తోట లక్షుమ్మ అనే మహిళ మనస్థాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ చెన్నకేశవ వివరాల మేరకు... ఓబులవారిపల్లె మండలం జీవీపురం గ్రామానికి చెందిన తోట లక్షుమ్మకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమెను నారాయణనెల్లూరులో ఇచ్చి వివాహం చేసింది. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో లక్షుమ్మ రెండు రోజుల కిందట తన కుమార్తెను చూసేందుకు నారాయణ నెల్లూరుకు వెళ్లింది. ఏమైందో ఏమోగాని శనివారం రాత్రి తల్లీకూతుర్ల మధ్య వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన లక్షుమ్మ తెల్లవారుజామున గ్రా మం ఆనుకొని ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పినట్లు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2021-05-24T05:41:00+05:30 IST