జమ్మలమడుగులో మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-09T04:39:43+05:30 IST
జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని కన్నెలూరు సొసైటీ కాలనీలో శనివారం దండే సులోచనాదేవి (26) అనే మహిళ ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

జమ్మలమడుగు రూరల్, మే 8: జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని కన్నెలూరు సొసైటీ కాలనీలో శనివారం దండే సులోచనాదేవి (26) అనే మహిళ ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ఆత్మహత్యకు పాల్పడిన సులోచనాదేవి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందినవారు. జమ్మలమడుగు పట్టణానికి చెందిన చౌడం సురేష్ అనే వ్యక్తితో అయిదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మృతురాలి భర్త జమ్మలమడుగులోని కెనరా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వారికి గణేష్ అనే బాలుడు ఉన్నాడు. శనివారం ఉదయాన్నే ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఏఎ్‌సఐ మురళీయాదవ్ తెలిపారు.