వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-01-13T05:40:17+05:30 IST

స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, మాజీ మేయర్‌ సురే్‌షబాబులు పేర్కొన్నారు.

వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
మాట్లాడుతున్న స్ఫెషల్‌ కలెక్టర్‌

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప(ఎర్రముక్కపల్లె), జనవరి 12: స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, మాజీ మేయర్‌ సురే్‌షబాబులు పేర్కొన్నారు. కడప వై.జంక్షన్‌ వివేకానంద నగర్‌లో మంగళవారం వివేకానంద రెసిడెన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వివేకానందుని జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, సంఘం నాయకులు యల్లారెడ్డి, కరస్పాండెంట్‌ మైథిలి, పద్మనాభరెడ్డిలు పాల్గొన్నారు.

మహనీయుడు..వివేకానంద: ట్రైనీ కలెక్టర్‌

కడప(మారుతీనగర్‌), జనవరి 12: మహనీయుడు స్వామి వివేకానంద అని ట్రైనీ కలెక్టర్‌ వికాస్‌ మర్మాట్‌ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భాన్ని పురష్కరించుకొని ఆశారేఖ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆకులవీధిలోని అర్బన్‌ రెసిడెన్షియల్‌ హోమ్‌లో చిన్నపిల్లల సమక్షంలో వేడుక లు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై తొలుత స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి, తదుపరి చిన్నపిల్లలతో కేక్‌ను కట్‌ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ చైర్మన్‌ నాగవేణి, నిర్వాహకులు పాల్గొన్నారు. 


భావితరాలకు ఆదర్శం ..

కడప(కలెక్టరేట్‌), జనవరి 12: స్వామి వివేకానంద భావితరాలకు, నేటి యువ తకు ఆదర్శమని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు కొనియాడారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో మంగళవారం స్వామి వివేకానంద జయంతిని  ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నేతలు మామిళ్లబాబు, సాధిక్‌, చెప్పలి పుల్లయ్య, సురేష్‌, అక్రమ్‌, మధురెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో..

ఎస్‌ఎ్‌సయూఐ నాయకులు ధ్రువకుమార్‌రెడ్డి, మామిళ్లబాబు ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో హరి, చరణ్‌, శ్యామ్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:40:17+05:30 IST