గెలుపోటములు సహజం : ఏఆర్‌ డీఎస్పీ

ABN , First Publish Date - 2021-08-28T05:20:01+05:30 IST

క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన వారు కూడా ఉత్సాహంగా ఉండాలని ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌ పేర్కొన్నారు.

గెలుపోటములు సహజం : ఏఆర్‌ డీఎస్పీ

కడప(క్రైం), ఆగస్టు 27: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన వారు కూడా ఉత్సాహంగా ఉండాలని ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌ పేర్కొన్నారు. కడప ఇండోర్‌ స్టేడియంలో రెండవ రోజు క్రికెట్‌ మ్యాచ్‌లో మైదుకూరు, పులివెందుల జట్లు తలపడగా, మైదుకూరు జట్టు విజేతగా నిలిచింది. అలాగే షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు సింగల్స్‌లో ఏఆర్‌ విభాగం నుంచి స్వామినాయక్‌, కడప సబ్‌ డివిజన్‌ తరపున చిన్నచౌకు ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డిల మధ్య మ్యాచ్‌ జరుగగా స్వామినాయక్‌ విజేతగా నిలిచారు. 

Updated Date - 2021-08-28T05:20:01+05:30 IST