ఉద్యోగాలు లేని జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకో...

ABN , First Publish Date - 2021-06-22T04:49:22+05:30 IST

ఉద్యోగాలు లేని జాబ్‌ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎవరి కోసం విడుద ల చేశారని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్‌కుమార్‌ ప్రశ్నించారు.

ఉద్యోగాలు లేని జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకో...

జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సునీల్‌కుమార్‌


రైల్వేకోడూరు, జూన్‌ 21: ఉద్యోగాలు లేని జాబ్‌ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎవరి కోసం విడుద ల చేశారని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్‌కుమార్‌ ప్రశ్నించారు. సోమవారం రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం ఇచ్చి ఆశీర్వదించండి మీ జీవితాలు మార్చేస్తా అని నాడు నిరుద్యోగులకు మోసపూరితమైన హామీలు ఇచ్చి నేడు నిరుద్యోగుల జీవితాలను చీకట్లోకి నెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ముఖ్యమంత్రిపైన చీటింగ్‌ కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. ఈసమావేశంలో రాజంపేట పార్లమెంట్‌ బీసీ నేతలు మండ్ల అమర్నాథ్‌, ఎన్‌ఆర్‌ఐ తెలుగు యువత ఉపాధ్యక్షుడు మల్లెం హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T04:49:22+05:30 IST