భూకబ్జాదారులపై చర్యలెక్కడ? : సీపీఐ
ABN , First Publish Date - 2021-09-04T05:05:27+05:30 IST
మండలంలో వందలాది ఎకరాలు కబ్జా లు చేస్తూన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీ ఐ నేతలు పి శ్రీరాములు, శివరాం,షావలి ప్రశ్నించారు.

మైదుకూరు, సెప్టెంబరు 3: మండలంలో వందలాది ఎకరాలు కబ్జా లు చేస్తూన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీ ఐ నేతలు పి శ్రీరాములు, శివరాం,షావలి ప్రశ్నించారు. శుక్రవారం సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటీయూసీ, బీకేఎంయూ నేతలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడు తూ
కోనేరు రంగారావు సిపారసు మేరకు పేద కుటుంబానికి హెక్టా రు భూమి ఇవ్వాలని చెప్పినా కనీసం ఎకరా కూడా ఇవ్వలేదని ఆవే దన వ్యక్తం చేశారు. కబ్జాదారులు భూములను ఆక్రమిస్తున్నా అధికా రులు పట్టించుకోవడం లేదని, అలాగే పట్టణంలో వంకలు, వాగులు కబ్జా చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసు కోకపోతే ఆందోళలు చేస్తామని డిమాండ్ చేశారు. నేతలు బాల సుబ్బయ్య, సుంకన్న, లక్షుమయ్య తదితరులుపాల్గొన్నారు.