సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకందాలి

ABN , First Publish Date - 2021-08-22T04:54:09+05:30 IST

పేదల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు అందేలా చూడాలని అందులో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని జాయింట్‌ కలెక్టరు ధర్మచంద్రారెడ్డి అన్నారు.

సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకందాలి
సచివాలయంలో జేసీ ధర్మచంద్రారెడ్డి

చెన్నూరు, ఆగస్టు 21 : పేదల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు అందేలా చూడాలని అందులో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని జాయింట్‌ కలెక్టరు ధర్మచంద్రారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం చెన్నూరు 1, 2, 3, ఉప్పరపల్లె గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం వచ్చిన సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించాలని, అలాగే పంపిణీ చేసే సమయంలో ఉన్న గడువు దాటిన తరువాత ఇవ్వవద్దని, వాటిని నిర్ణీత కాలంలో మాత్రమే అందివ్వాలన్నారు. సచివాలయాలపై కార్యదర్శుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజల బాధలు అన్నింటినీ గమనిస్తూ వారిచ్చే వినతిపత్రాలు, అర్జీలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో ఉప్పరపల్లె సర్పంచ్‌ తుమ్మల శ్రీలక్ష్మి, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, గంగులయ్య, సర్వేయరు వెంకటశివారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T04:54:09+05:30 IST