సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి: బీజేపీ
ABN , First Publish Date - 2021-07-25T05:11:57+05:30 IST
బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యల్లారెడ్డి అన్నారు.

చెన్నూరు, జూలై 24: బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యల్లారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం చెన్నూరు సరస్వతీ శిశుమందిర్‌లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దాదాపు 115 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు సమీరా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదినేని రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.