మున్సిపల్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-01-13T05:22:26+05:30 IST

మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న కార్మికులకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎరప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

మున్సిపల్‌ కార్మికులకు   సంక్షేమ పథకాలు అమలు చేయాలి
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రొద్దుటూరు, జనవరి 12 : మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న కార్మికులకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎరప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి వారొక వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మున్సిపల్‌ వర్కర్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి విజయభాస్కర్‌ మాట్లాడుతూ గతేడాది మున్సిపల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ పిల్లలకు అమ్మఒడి పఽథకం అమలు చేసిందన్నారు. అయితే ఈ ఏడాది  కంప్యూటర్‌లో ఉద్యోగిగా చూపించడం వల్ల అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల పిల్లలు అమ్మఒడి పథకానికి దూరమయ్యారన్నారు.  కార్యక్రమంలో కమిషనర్‌ రాధ,  యూనియన్‌ జిల్లా వర్కిం గ్‌ ప్రెసిండెంట్‌ విజయకుమార్‌, పట్టణ కార్యదర్శి సాల్మన్‌, అధ్యక్షుడు చంటి,  రాఘవేంద్ర, రవికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:22:26+05:30 IST