ఏప్రిల్‌ 1 నుంచి వాస్కోడిగామాకు వీక్లీ ఎక్స్‌పెరస్‌ రైలు

ABN , First Publish Date - 2021-02-27T05:08:07+05:30 IST

తిరుపతి నుంచి వాస్కోడిగామా (07419)కు వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

ఏప్రిల్‌ 1 నుంచి వాస్కోడిగామాకు వీక్లీ ఎక్స్‌పెరస్‌ రైలు

కడప (ఎర్రముక్కపల్లె), ఫిబ్రవరి 26 : తిరుపతి నుంచి వాస్కోడిగామా (07419)కు వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. ఏప్రిల్‌ 1వ తేదీ ఉదయం 11.40గంటలకు తిరుపతి నుంచి ప్రారంభమై రేణిగుంట మీదుగా కడప రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకుంటుందన్నారు. 1.42 గంటలకు మళ్లీ ప్రారంభమై ఎర్రగుంట్ల, తాడిపత్రి మీదుగా మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుందన్నారు. అలాగే వాస్కోడిగామా నుంచి తిరుపతి (07420)కి స్పెషల్‌ రైలు 2వ తేదీ ఉదయం 9గంటలకు ప్రారంభమై కడప రైల్వేస్టేషన్‌కు అదే రోజు రాత్రి 11.14కు చేరుకుంటుందని తెలిపారు. రాత్రి 12 గంటలకు కడప రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమై తిరుపతికి ఉదయం 2.55 గంటలకు చేరుకుంటుందన్నారు.

Updated Date - 2021-02-27T05:08:07+05:30 IST