జమ్మలమడుగులో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తాం - ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2021-03-25T04:50:05+05:30 IST
జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ రవీంద్రనాధ్‌రెడ్డి (బీటెక్ రవి) అన్నారు.

35 కుటుంబాలు టీడీపీలో చేరిక
మైలవరం, మార్చి 24 : జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ రవీంద్రనాధ్‌రెడ్డి (బీటెక్ రవి) అన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని ఎం.కంబాలదిన్నెలో బీటెక్ రవి పర్యటించడంతో గ్రామస్తులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన మారెమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం గ్రామంలోని సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నా రు. చావిడి వద్ద భారీ సంఖ్యలో పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ టీడీపీ జెండా ఎగురవేశారు. అనంతరం బీటెక్ రవి గ్రామానికి చెందిన మంత్రి జాఘవ, నర్సయ్య ఆధ్వర్యంలో 35 కుటుంబాలకు చెందిన పలువురికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్బంగా బీటెక్ రవి మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజక వర్గంలో మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి పార్టీలు మారారని, గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు టీడీపీని నమ్ముకుని ఉన్నారన్నారు. టీడీపీ వారిపై అనవసరంగా దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి గోవింద్, తెలుగు యువత నాయకులు గొరిగెనూరు సుధీర్‌రెడ్డి, టీడీపీ నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, బాబాపీర్, సూర్యరాయల్, నాగేశ్వరరెడ్డి, శివారెడ్డి, రామాంజనేయరెడ్డి, భూపాల్, తేజ తదితరులు పాల్గొన్నారు.