మీ కుటుంబానికి అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-10-29T05:04:51+05:30 IST

మీ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 2020 జూలై 10న కొవిడ్‌ భారిన పడి మృతిచెందిన ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వరప్రసాద్‌ కుటుంబాన్ని కడప నగరం రాజారెడ్డి వీధిలో ఎస్పీ గురువారం పరామర్శించి ధైర్యం చెప్పారు.

మీ కుటుంబానికి అండగా ఉంటాం
హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబంతో మాట్లాడుతున్న ఎస్పీ

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ 

కడప(క్రైం), అక్టోబరు 28: మీ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 2020 జూలై 10న కొవిడ్‌ భారిన పడి మృతిచెందిన ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వరప్రసాద్‌ కుటుంబాన్ని కడప నగరం రాజారెడ్డి వీధిలో ఎస్పీ గురువారం పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసు శాఖలో అంకితభావంతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన వరప్రసాద్‌ సేవలను జిల్లా పోలీస్‌ శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. కడప నగరం రాజారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న వరప్రసాద్‌ ఇంటికి చేరుకొని ముందుగా దివంగత ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఆర్‌ఐ వీరేష్‌, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్‌, కోఆప్షన్‌ సభ్యులు బండారు రామకృష్ణ ఉన్నారు. 

Updated Date - 2021-10-29T05:04:51+05:30 IST